హమాస్ తో పోరాడుతున్న ఇజ్రాయెల్ కు అండగా మేముంటాము: బ్రిటన్ ప్రధాని

-

పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తున్నారు. అయితే ఈ యుద్ధంలో అమాయక ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యుద్ధం జరుగుతున్న కొద్దీ ప్రపంచ దేశాలలో నుండి మెల్ల మెల్లగా ఇజ్రాయెల్ కు మద్దతు పెరుగుతూ ఉంది. ఇప్పటికే అమెరికా, రష్యా లు మద్దతుగా ఉంటామని ప్రకటించగా తాజాగా మరో దేశం వీరికి అండగా ఉంటామని మాటిచ్చింది. ఈ యుద్ధంలో తమ ప్రజలను మరియు దేశాన్ని రక్షించుకోవడానికి హమాస్ తో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో మా సంపూర్ణ మద్దతు ఉంటుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. ఈ రోజు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన రిషి సునాక్ ప్రధాని నెతన్యాహు తో చాలాసేపు దేశ పరిస్థితులపై చర్చించారు.

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సంరక్షణకు బ్రిటన్ అండగా ఉంటుందన్న భరోసాను రిషి సునాక్ నెతన్యాహు అందించారు. ఈ సందర్భంగా రిషి సునాక్ కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కృతజ్ఞతలు తెలియచేశారు. ఇక రోజుకు ఒక వీడియో తో ఇజ్రాయెల్ ప్రజల కష్టాలు ప్రపంచమంతా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news