మాజీ మంత్రి నారాయణ నా మీద కన్నేశాడు – తమ్ముడి భార్య

-

టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణకు ఊహించని షాక్‌ ఇచ్చింది ఆయన తమ్ముడి భార్య మణి ప్రియ. మాజీ మంత్రి నారాయణ ఒక డేగలా తనపై కన్నేసాడంటూ ఆయన తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. “డేగ… ఒక పిట్టను ఎత్తుకెళ్లినట్టు నా పరిస్థితి మారింది.

ఇంట్లో భార్య ఉండగానే నేను అన్నం తీసుకురాలేదని నారాయణ కొట్టాడు. నన్ను టార్చర్ చేసేవాడు” అంటూ నారాయణ తమ్ముడి భార్య ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ నన్ను తీవ్రంగా హింసిస్తున్నారు. అర్ధరాత్రి పూట నన్ను టార్చర్ పెడుతున్నారంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రియా పొంగూరు కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version