అబద్దానికి అంగి, లాగు వేస్తే అదే నువ్వు.. రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ సంచలన కామెంట్స్..!

-

రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ మండిపడుతోంది మాజీ సీఎం కేసీఆర్ ను చూస్తే గ్లోబల్ మళ్లీ పుట్టాడు అనిపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పోస్ట్ గురించి తెలిసిందే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి నెలరోజుల పాటు హాస్టల్స్ మూసి వేయడం గురించి ఇటువంటి నోటీస్ ని ఇచ్చింది. అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది నువ్వే రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి గ్లోబెల్స్ గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు.

Revanth Reddy reacted to the OU controversy

ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఒక సోషల్ మీడియా ట్రోల్ లాగా ఫేక్ సెక్యులర్ పోస్ట్ చేయడానికి కొంచమైనా సిగ్గు శరం మానం అభిమానం ఉండాలని బీఆర్ఎస్ విమర్శించింది. విద్యార్థులకి కనీసం నీళ్లు కరెంట్ ఇవ్వడం చేతకాని దద్దమ్మవి నువ్వని వెళ్లి నీ ఫేక్ ముచ్చట్లు ఓయూలో నీళ్లు కరెంట్ కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులకు చెప్పు నిన్ను పరిగెత్తిస్తారు అని బీఆర్ఎస్ పోస్ట్ చేసింది. హామీలు ఫేక్ మీ పాలన ఫేక్ మాటలు ఫేక్ చివరికి సోషల్ మీడియా పోస్ట్ కూడా ఫేక్ అని ఆరోపించింది. ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే సోషల్ మీడియాలో ఫేక్ సర్కులర్ పోస్ట్ చేసే స్థాయికి దిగజారావంటే ఎంత అభద్ర భావంతో బతుకుతున్నావా అర్థమవుతుందని బీఆర్ఎస్ విమర్శించింది.

Read more RELATED
Recommended to you

Latest news