వాళ్ళను వదిలిపెట్టేది లేదు.. ఫేక్ వీడియో పై బండి సంజయ్ సీరియస్..!

-

తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లుగా నీచ రాజకీయాలు జరుగుతున్నాయని ఇక్కడ జరుగుతున్న రాజకీయాలను చూసి దేశ ప్రజల సిగ్గుతో తలదించుకునే పరిస్థితి కలిగిందని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఫోన్ టాపింగ్ ద్వారా భార్యాభర్తల సంభాషణలు వింటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ వీడియోలు సృష్టిస్తుందని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అనని మాటలని అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఏ స్థాయిలో భయం ఉందో అర్థమైంది అని బండి సంజయ్ అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ భయంతో బిజెపి కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాని కంటే రెండింతలు భయపడుతోందని అన్నారు. మంగళవారం వేములవాడిలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ మోడీ బహిరంగ సభ ని అందరూ విజయవంతం చేయాలని కోరారు దొంగ వీడియోలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఓడిపోతామని భయంతో కాంగ్రెస్ దిగజారుతోంది. కాంగ్రెస్ బండారం బయటపడి పోయిందని బిజెపి వీళ్ళని వదిలిపెట్టదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news