మూసీ పరివాహక ప్రాంతాలను సుందరీకరణ చేసే ప్రక్రియకు బీజం వేసిందే బీఆర్ఎస్ అని బీజేపీ స్టేట్ చీఫ్,కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అప్పట్లో మూసీ సుందరీకరణకు బీజం వేసిందన్నారు.అధికారం కోల్పోగానే మూసీ బెల్ట్ ఏరియాలోని పేదలు వారికి గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు.నిరుపేదలు నివాసముండే బస్తీలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే ప్రయత్నం చేస్తుందన్నారు.
పేదల ఇళ్ల కూల్చివేతల అంశంలో సీఎం రేవంత్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారంలో ఉన్న పార్టీ అందరికీ మంచి చేయాలి కానీ ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దన్నారు.పేదల ఇళ్ల కూల్చివేతలకు బీజేపీ వ్యతిరేకమన్నారు. ఇక అక్కినేని కుటుంబం, హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మహిళగా, మరో మహిళ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదన్నారు. మహిళల గురించి అసభ్యంగా మాట్లాడటం కాంగ్రెస్,బీఆర్ఎస్‌లకు అలవాటైపోయిందని మండిపడ్డారు.