దున్నపోతును ముందు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా విషయంలో దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తుందని దున్నపోతును ముందు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన తెలిపారు.

రైతులకు వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి దారూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైటయించి వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నిరసన తెలియజేశారు. ఈ సంఘటన కు సంబందించిన వీడియో వైరల్ గా మారింది.
ఇక అటు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి రైతు వేదిక వద్ద యూరియా కోసం క్యూ లైన్‌లో చెప్పులు, రాళ్లు పెట్టి రైతులు అవస్థలు పడుతున్నారు. గత నెల రోజులుగా యూరియా కోసం కష్టాలు పడుతున్నామని, అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని ఆవేదన వ్యక్తం చేసారు రైతులు.
కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా విషయంలో దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తుందని దున్నపోతును ముందు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన
రైతులకు వెంటనే యూరియా అందించాలని డిమాండ్
రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి దారూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైటయించి నిరసన… pic.twitter.com/iBzbxXBYce
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2025