దక్షిణ భారత దేశానికి చెందిన స్టార్ హీరో విశాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇదివరకే దీనిపై ప్రకటన చేయగా తాజాగా నటి సాయి దన్సికతో హీరో విశాల్ నిశ్చితార్థం జరిగింది. ఈ మేరకు రింగులు మార్చుకున్నారు విశాల్ అలాగే నటి సాయి.

త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఫోటోలను కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్… విశాల్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా ఇటీవలే వేదికపై స్పృహ తప్పి పడిపోయాడు హీరో విశాల్. తమిళనాడు విల్లుపురంలో జరిగిన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన విశాల్… వేదికపై స్పృహ తప్పి పడిపోయాడు.