తెలంగాణ ప్రజలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో ఇంతకుముందు ప్రవేశపెట్టిన పథకాలన్నీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కొనసాగుతాయని చెప్పిన కేసీఆర్.. మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రైతు బీమా తరహాలో… తెల్ల రేషన్ కార్డుదారులకు… బీమా అమలు చేస్తామని.. ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎల్‌ఐసీ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టి… పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు.
రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో క్లిష్ట పరిస్థితులు ఉండేవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడక ముందు కరెంట్, నీటి సౌకర్యాలు ఉండేవి కావని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పని వాటిని కూడా అమలు చేశామన్న ఆయన.. ఎన్నికల ప్రణాళికలో లేని వాటిని కూడా అమలు చేశామని వివరించారు.
ఈ క్రమంలోనే కల్యాణలక్ష్మి పథకం గురించి ఎవరూ అడగకపోయినా అమలు చేశామన్న ఆయన.. ఎన్నికల ప్రణాళికలో లేనివాటినీ అమలు చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణ పరిస్థితులు ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. దళితబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని.. ఆ పథకాన్ని కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.