సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కి సంబంధించిన మ్యానిఫెస్టోను ప్రకటించారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా ప్రజలందరికీ రూ.5లక్షల కేసీఆర్ బీమా. కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్ ఏర్పాటు చేయనున్నారు. సాామాజిక పెన్షన్లు రూ.5వేలకు పెంపు. తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణి, మైనార్టీ బడ్జెట్ పెంపు, మైనార్టీ సంక్షేమం.. ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. దళితబంధును కొనసాగిస్తాం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని నిర్ణయం. మైనార్టీ జూనియర్ కళాశాలకు డిగ్రీ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయడం వంటివి మ్యానిఫెస్టోలో చేర్చారు సీఎం కేసీఆర్.
అదేవిధంగా అర్హులైన పేద మహిళలకు రూ.3వేలు అందజేయనున్నారు. దీనికి సౌభాగ్య లక్ష్మీ పథకం పేరు పెట్టనున్నారు. ఆసరా పెన్షన్లను రూ.5వేలకు పెంచినట్టు.. దివ్యాంగులకు రూ.6వేలకు పెన్షన్ పెంపు, జర్నలిస్టులకు రూ.400కే సిలిండర్, రైతుబంధు పథకానికి రూ.16వేలు అందజేయనున్నట్టు తెలిపారు కేసీఆర్. హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించనున్నట్టు తెలిపారు సీఎం కేసీఆర్.