సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. కంటోన్మెంట్ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మారేడుపల్లిలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. కంటోన్మెంట్ ఉపఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. సర్వే ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తామని మంత్రి తలసాని చెప్పారు. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1 నుంచి 4 వరకు కంటోన్మెంట్ ఎన్నికల ఓటర్ల సవరణ చేయనున్నారు. మార్చి 1 నుంచి 4 వరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. మార్చి 23న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుండగా.. మార్చి 28, 29 తేదీల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అదే విధంగా ఏప్రిల్ 6న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల నుంచి పేర్లను ప్రకటిస్తారు. ఇక కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ఏప్రిల్ 30న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.