తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రజాకార్ల పాలన ని గుర్తుకు తెస్తోందని అందుకు నిదర్శనం అవినీతి దోపిడీలే అని ఆర్కూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్పారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తెలంగాణలోని ప్రతిపక్షాలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు ఎమ్మెల్యే బీజేపీపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైం లో అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ అందిస్తామని అబద్ధపు ప్రచారం చేసిందని ఆరోపించారు. డబ్బుని దోచుకుని దక్షిణ తెలంగాణకి ముఖ్యంగా కొడంగల్ ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని ఆయన సొంత నియోజకవర్గానికి మళ్ళిస్తున్నారని అన్నారు. ఇప్పటికే రుణమాఫీ చేయలేదు అన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2500 అందిస్తామన్నారు ఇలా రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిన్న ఒకసారి గుర్తు చూసారు.