భిన్న భాషలు, భిన్న సాంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్ స్ఫూర్తి ఫరిడావిల్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కీలక ఫలితం దక్కింది. సీఎం కేసీఆర్ డిమాండ్ మేరకు ఇకనుంచి అన్ని ప్రాంతీయ భాషల్లో కేంద్రం పోటీ పరీక్షలు నిర్వహించనున్నది.
రైల్వేలు, డిఫెన్స్, బ్యాంకులు తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే నిర్వహించడం సరికాదని, భిన్న భాషలున్న దేశంలో ఆయా రాష్ట్రాల స్థానిక భాషల్లోనే పరీక్షలు నిర్వహించి, దేశవ్యాప్తంగా నిరుద్యోగులు నష్టపోకుండా చూడాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చేసిన డిమాండ్ కు కేంద్రం స్పందించింది.
సీఎం కేసీఆర్ డిమాండ్ మేరకు హిందీ, ఇంగ్లీష్ తో పాటు రాజ్యాంగం 8వ షెడ్యూల్ లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని, కేంద్ర సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది.