తాజాగా సంక్రాంతి విజేతగా నిలిచిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు భోళా శంకర్ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా ఎన్నికవ్వగా.. ఆయనకు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే సినిమా ముందుగా అనుకున్న తేదీకి విడుదల కాకపోవచ్చు అనే వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.
గతంలో ఏప్రిల్ 14 2023 రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భోళాశంకర్ సినిమాను మే 12వ తేదీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం అందుతోంది. అయితే మెగాస్టార్ సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవడానికి కారణం యంగ్ హీరో అక్కినేని అఖిల్ అని తెలుస్తోంది . అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇటు చిరంజీవి భోళా శంకర్ సినిమాను కూడా ఆయనే నిర్మిస్తూ ఉండడం గమనార్హం.
ఇకపోతే ఈ రెండు సినిమాలను ఒకేసారి విడుదల చేస్తే.. బిజినెస్ విషయంలో నష్టం వచ్చే అవకాశం ఉందని మెగాస్టార్ సినిమాను వాయిదా వేశారని తెలుస్తోంది. నిజానికి అఖిల్ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తుంది. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే సినిమాను రిలీజ్ చేయాల్సిందని నిర్మాతలు నిశ్చయించుకున్నారు. అందుకే అఖిల్ ఏజెంట్ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . దాంతో మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ను మే నెలకి షిఫ్ట్ చేసినట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి.