బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ అద్భుతం చేశారు. కేసీఆర్‌కు వెండి పట్టు పోగులతో ప్రత్యేక శాలువాను రూపొందించాడు. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆదేశం మేరకు చేనేత కార్మికుడు హరిప్రసాద్ దాదాపు 5 రోజుల పాటు శ్రమించి 32 గ్రాముల వెండి, పట్టు దారాలతో కేసీఆర్ ముఖచిత్రం.. వరంగల్ కాకతీయ కామన్.. సిల్వర్ జూబ్లీ లోగో రెండు పక్కల వచ్చే విధంగా ప్రత్యేక శాలువాను రూపొందించాడు.
ఈ శాలువా 2.5 మీటర్ల పొడవు, 46 అంగుళాల వెడల్పుతో ఉంటుంది. ఇందులో వెండి పట్టు దారాలతో కేసీఆర్ ముఖచిత్రం, వరంగల్ కాకతీయ కామన్ మరియు సిల్వర్ జూబ్లీ లోగోలు రెండూ ప్రత్యేకంగా నేయబడ్డాయి.ఈ ప్రత్యేకమైన శాలువాను ఈరోజు జరగబోయే వరంగల్ సభలో జిందం చక్రపాణి కేసీఆర్‌కి అందించనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా:
బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ అద్భుతం.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం కేసీఆర్ కి వెండి పట్టు పోగులతో ప్రత్యేక శాలువా తయారు చేసి సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ మరో అద్భుత సృష్టి
వివరాల్లోకి వెళితే జిల్లా కేంద్రంలోని పట్టణ బీఆర్ఎస్ పార్టీ… pic.twitter.com/ofsoggPTuW
— Telangana Awaaz (@telanganaawaaz) April 27, 2025