వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత అయిన ఆయన్ను 2019 ఎన్నికల ముందు గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు తారుమారు చేశారని.. సాక్షులను ఒక్కొక్కరిగా హత్య చేసుకుంటూ వచ్చారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు.
ప్రస్తుతం కూటమి అధికారంలో ఉండటంతో ఆయన కూతురు ఫిర్యాదు మేరకు వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలపై సిట్ విచారణ ప్రారంభించింది.వివేకా హత్య కేసులో ఇప్పటివరకు ఆరుగురు సాక్షులు మృతి చెందగా.. వారి మరణాలపై సిట్ అధికారులు విచారణ చేపట్టారు. మృతుడు శ్రీనివాసరెడ్డి బామ్మర్ది పరమేశ్వర్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. లింగాల పోలీస్ స్టేషన్‌లో పరమేశ్వర్ రెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. విచారణకు రావాలని రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు
ఇచ్చింది.