కాళేశ్వరం మాజీ ఈఎన్సీ చీఫ్ భూక్య హరిరామ్ ఇళ్లు, ఆయన బంధువుల ఇళ్లపై శనివారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఏకకాలంలో 14 చోట్ల దాడులు జరిపి సుమారు రూ.200 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
అయితే, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో శనివారం ఏసీబీ రైడ్స్ నిర్వహించి ఆయన్ను అరెస్టు చేసింది. అర్ధరాత్రి ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. 14 రోజల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో హరిరామ్‌ను పోలీసులు నేరుగా అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. రైడ్స్‌లో భాగంగా ఏసీబీ అధికారులు హరిరామ్ పేరిట, ఆయన బంధువుల పేరిట ఉన్న డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.