ఏ ఎన్నిక వచ్చిన బీఆర్ఎస్‌దే విజయం : పంచాంగ శ్రవణం

-

ఉగాది పండుగ పర్వదినాన తెలంగాణ భవన్‌లో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలా ఉండబోతుందని పురోహితులు వెల్లడించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాశి ఫలం ఎలా ఉంటుందనేది వివరించడంతో గులాబీ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

ఇకమీదట రాష్ట్రంల ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమని ఆయన వెల్లడించారు. దీంతో ప్రజలు బీఆర్ఎస్ వైపునే ఉన్నారని.. రాష్ట్రంలో వార్డు మెంబర్ నుండి ఎమ్మెల్యే ఎన్నికల వరకు ఎన్నిక ఏదైనా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని అటు గులాబీ పార్టీ శ్రేణులు సైతం బలంగా విశ్వసిస్తున్నారు. ఈ ఏడాది పార్టీకి అనుకూలంగా ఉంటుందని, మంచి ఫలితాలు వస్తాయని పంచాంగ శ్రవణంలో వెల్లడైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version