తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. డబ్బులు వస్తున్నాయా? లేదా అనేది మాత్రమే వారు పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హోటల్స్, ఫుడ్ నిర్వాహకులు కిచెన్ శుభ్రంగా ఉంచకపోవడం ఒక తప్పయితే.. బల్లులు, బొద్దింకలు, పురుగులు పడిన ఫుడ్ కస్టమర్లకు అందించడం దారుణమైన తప్పిదం. ఇలాంటి ఘటనలో రాష్ట్రంలో అనేకం వెలుగుచూస్తున్నాయి.
తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా అహ్మద్ టిఫిన్ సెంటర్‌లో బల్లి పడ్డ చట్నీ తిని నలుగురు అస్వస్థతకు గురయ్యారు.బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఎస్ఐ కళ్యాణ్ రావు ఆస్పత్రికి చేరుకొని వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం టిఫిన్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.