కేటీఆర్‌కు అరుదైన గౌరవం.. న్యూయార్క్‌లో ‘గ్రీన్ లీడర్‌షిప్’ అవార్డ్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అరుదైన గౌరవం ద‌క్కింది. న్యూయార్క్‌లో ‘గ్రీన్ లీడర్‌షిప్’ అవార్డ్ ద‌క్కింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ NYC గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా కేటీఆర్‌కు తెలియజేసింది.

KTR
KTR

“గ్రీన్ మెంటార్స్ తరపున, గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025 గ్రహీతగా మీ ఎంపికను ధృవీకరించడం మాకు ఒక విశేషం” అని వారు తమ లేఖలో పేర్కొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణలో అనేక అద్భుతమైన పర్యావరణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 977 పార్కులను అభివృద్ధి చేసి, 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు, 108 లంగ్ స్పేస్‌లు, థీమ్ పార్కులు, రెయిన్ గార్డెన్స్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, వర్టికల్ గార్డెన్‌లను ఏర్పాటు చేశారు. సంస్థాగత తోటలు, కాలనీ, వీధి తోటలు, మీడియన్, అవెన్యూ తోటల పెంపకానికి పెద్ద ఎత్తున కృషి చేసి, తెలంగాణ పచ్చదనాన్ని గణనీయంగా పెంచారు. ఈ కార్యక్రమాలతో హైదరాబాద్ పర్యావరణ పాలనలో ఒక ప్రపంచ ఆదర్శంగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news