తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..ఇక ఎంసెట్‌తోనే బీఎస్సీ నర్సింగ్ కోర్సులు

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఓ శుభవార్త. తెలంగాన రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్‌ సీట్లను ఇక నుంచి ఎంసెట్‌ ద్వారానే భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. వచ్చే సంవత్సరం అంటే 2022-23 ప్రవేశాలను ఎంసెట్‌ ర్యాంకులతో.. భర్తీ చేయాలని.. కాళోజీ వైద్య విశ్వ విద్యాలయం ఇటీవల ప్రభుత్వానికి ప్రతి పాదన సమర్పించింది.

కేసీఆర్‌ సర్కార్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇస్తే… ఆ వెంటనే అధికారులు రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి లేఖ రాసి ఎంసెట్‌ లో చేర్చ నున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉన్నందున్న వారు దీనిపై దృష్టి సారించారు. త్వరలోనే అనుమతి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ మార్కుల ఆధారం గా ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో సీట్ల ను విశ్వ విద్యాలయం భర్తీ చేయనుంది. ఇక ప్రవేశ పరీక్ష తప్పనిసరి కావడంతో.. ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలని కాళోజీ వర్సిటీ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version