హీరో విజయ్ కి షాక్ ఇచ్చిన BSP..!

-

తమిళ సూపర్ స్టార్ హీరో దళపతి విజయ్ కి బహుజన సమాజ్ పార్టీ షాక్ ఇచ్చింది. అయితే తమిళనాడులో వచ్చే ఎలక్షన్ లో పోటీ పడటం కోసం హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం అనే పేరుతో రాజకీయ పార్టీని పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యే తన పార్టీ టీవీకే కు సంబంధించిన జెండాను విధాలా చేసాడు విజయ్. అయితే ఆ జెండాపై రెండు ఏనుగులు ఉన్నాయి. దీంతో విజయ్ తన పార్టీ జెండాపై మా పార్టీ గుర్తు అయిన ఏనుగు గుర్తును ముద్రించారంటూ ఎన్నికల కమిషన్‌కు బహుజన సమాజ్ ఫిర్యాదు చేసింది.

విజయ్ తన పార్టీ జెండాలో ఏనుగు గుర్తును ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది BSP. ఏనుగు బహుజన సమాజ్ పార్టీ జాతీయ చిహ్నంగా ఉపయోగిస్తున్నందున విజయ్ పార్టీ జెండా పై ఉన్న ఏనుగు గుర్తును తొలగించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ ముందు ఉంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version