హైదరాబాద్ లోని మొయినాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. జెబిఐటి ఇంజనీరింగ్ కళాశాల లో విద్యార్థి గజ్జల విజయ భాస్కర్ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గది లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు విద్యార్థి గజ్జల భాస్కర్ రాజు. భాస్కర్ రాజు కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థి అని సమాచారం అందుతోంది.
గత రెండు నెలల క్రితం జెబిఐటి ఇంజనీరింగ్ కళాశాల లో జాయిన్ అయ్యాడు విద్యార్థి భాస్కర్ రాజు. అయితే… ఇవాళ వేకువ జామున భాస్కర్ సుసైడ్ చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో కళాశాల ముందు ఆందోళనకు దిగారు తోటి విద్యార్ధులు. భాస్కర్ కు న్యాయం చేయాలని డిమాండ్ నినాదాలు చేస్తున్నారు విద్యార్థులు. ఈ సంఘటన నేపథ్యంలో భారీగా కళాశాల వద్దకు చేరుకుంటున్నారు విద్యార్థులు. యాజమాన్యం కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. విద్యార్థులు భారీగా రావడంతో పోలీసులు మోహరించారు. ప్రస్తుతం జెబిఐటి ఇంజనీరింగ్ కళాశాల దగ్గర పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది.