ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న వాయుగుండముగా ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మధ్య తీరము దాటి తీవ్ర అల్ప పీడనముగా ఏర్పడి మరియు ఈరోజు దక్షిణ కర్ణాటక మరియు పరిసర ప్రాంతాలైన ఉత్తర తమిళనాడు ,రాయలసీమ మీద అల్పపీడనంగా బలహీనపడినది.
దీనికి అనుబంధముగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5 .8 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల మీద కొనసాగుతున్నది. ఈ ఉపరితల ఆవర్తనంనుండి ఒక అల్పపీడన ద్రోణి ఉత్తర తమిళనాడు,రాయలసీమ మరియు కోస్తాంధ్ర మీదగా దక్షిణ ఒడిస్సా వరకు 1 .5 కిలోమీటర్లు ఎత్తులో కొనసాగి బలహీనపడినది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.