ఇసుక‌తో బీటెక్ విద్యార్థుల హైటెక్ సంపాద‌న‌

-

చ‌దివేది బీటెక్.. కానీ సంపాద‌న మాత్రం హైటెక్ త‌ర‌హాలో… ఇంత‌కు బీటెక్ చ‌దివిన‌, చ‌దువుతున్న విద్యార్థులు ఎలా హైటెక్‌లో సంపాదిస్తున్నారు.. ఏదైనా సాప్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేసి సంపాదిస్తున్నారుకునేరు సుమీ.. అదేం కాదండి.. ఇసుక‌తో సంపాదిస్తున్నారు. చ‌దువేమో బీటెక్‌.. సంపాదించేదేమో హైటెక్కా ఇదేక్క‌డి ఇసుక భాగోత‌మండి బాబోయ్ అనుకుంటున్నారా ? నిజ‌మే సుమండి. బీటెక్ విద్యార్థులు ఇసుక పేరుతో హైటెక్ వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకుంటూ వేల‌ల్లో సంపాదిస్తూ హైఫైయ్‌గా జీవిస్తున్నారు. ఇంత‌కు ఇసుక సంపాద‌న ఎలా సంపాదిస్తున్నారో మీరు చూడండి.

Btech student Earn Money On Online sand booking

తెలంగాణ స‌ర్కారు ఇసుక అమ్మ‌కాల‌పై ఓ కొత్త పాల‌సీని తీసుకొచ్చింది. గ‌తంలో లాగా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ అడ్డ‌గోలుగా ఇసుక త‌వ్వుకుని అమ్ముకునే వారు. కానీ ఇప్పుడు ఇసుక పాల‌సీ తెచ్చి అంతా ఆన్‌లైన్ ప‌ద్ద‌తిని ప్ర‌వేశ‌పెట్టింది. అయితే ఇసుక కావాల‌నుకునే వినియోగ‌దారులు ఇసుక‌కు సంబంధించిన ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో న‌మోదు చేసుకోవాలి. ఇసుక ఆన్‌లైన్ బుకింగ్‌కు sand.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి ముందుగా లారీ నంబర్‌ను నమోదు చేసుకోవాలి.

ఆధార్‌కార్డుతో అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌తో వినియోగదారుగా నమోదవ్వాలి. మధ్యాహ్నం 12 గంటలకు లాగిన్‌ అయ్యి జిల్లాను, ఇసుకరీచ్‌ను ఎంపిక చేసుకుని లారీ నంబర్‌ను, ఎంత ఇసుక కావాలి ? డెలివరీ చేయాల్సిన చోటు వంటి వివరాలను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ చేస్తే ఆన్‌లైన్‌ పేమెంట్‌కు వెళ్తుంది. అది సఫలమైతే బుకింగ్‌ జరిగినట్లు ఆర్డర్‌ వివరాలతో ఒక నంబర్‌ (ఓఆర్డీ) వస్తుంది. ఆ నంబర్‌తో ఇసుకలారీ రీచ్‌కు వెళ్తే అక్కడ ఇసుకను నింపి ఇస్తారన్న మాట‌. అలా ఇసుక ఆన్‌లైన్ చేయాలంటే లారీ య‌జ‌మానుల‌కు త‌ల‌కు మించిన భారంగా మారింది.

అయితే ఇక్క‌డే బీటెక్ విద్యార్థుల‌కు ఓ చ‌క్క‌టి ఆలోచ‌న వ‌చ్చింది. ఇసుక ఆన్‌లైన్‌లో న‌మోదు చేస్తే లారీ య‌జ‌మానులు ద‌గ్గ‌రినుంచి వేల రూపాయ‌లు ఆర్జించ‌వ‌చ్చ‌నే తెలిసింది. దీంతో ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ కోసం రోజులో కొంత స‌మ‌యం కెటాయిస్తూ ఆన్‌లైన్ బుకింగ్ చేస్తున్నారు. ఇలా ఆన్‌లైన్ బుకింగ్ చేసి లారీ య‌జ‌మానుల వ్యాపారానికి తోడ్పాటు అందిస్తుండ‌టంతో ఒక్కో లారీ య‌జ‌మాని నుంచి ఒక్కో లారీకి వేల‌ల్లో డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. దీంతో బీటెక్ విద్యార్థ‌లు కాసులే కాసులు.

అందుకే బీటెక్ విద్యార్థులు మ‌ద్యాహ్నం స‌మ‌యంలో ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ కోసం స‌మ‌యం వెచ్చిస్తున్నారట‌. ఇలా ఉంది బీటెక్ విద్యార్థుల ఇసుక వ్యాపారం… ఆన్‌లైన్‌లో ఒక లారీ బుక్ అయిందా.. పండుగే పండుగ‌… కాలేదా.. మ‌రోరోజు ట్రై చేద్దాం అనుకుంటూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు బీటెక్ విద్యార్థులు.. అందుకే అంటారు పెద్ద‌లు ఉపాయం వ‌స్తే ఉపాసం ఉండ‌రు అని.. బీటెక్ విద్యార్థులు కూడా నెల‌ల త‌ర‌బ‌డి ఉద్యోగం చేసేక‌న్నా నెల‌లో ఓ నాలుగో ఐదో ఇసుక లారీలు త‌గిలితే జాక్ పాట్ కొట్టిన‌ట్లే…

Read more RELATED
Recommended to you

Exit mobile version