వేదిక‌పై లైవ్‌లో పాప్‌స్టార్ స‌జీవ‌ద‌హ‌నం – వీడియో

-

ఒక సంగీత కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ మ్యూజికల్ షో జ‌రుగుతుండ‌గా వేదిక‌పై జ‌రిగిన ప్ర‌మాదంలో ప్ర‌ముక పార్‌స్టార్ లైవ్‌లోనే కాలిపోయి మృతిచెందింది. ఆమె ఎవ‌రో కాదు ప్ర‌ముఖ స్పానిష్‌ పాప్‌స్టార్‌, డాన్సర్‌ జోయానా సెయిన్స్‌. సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా బృందంతో కలిసి ప్రదర్శన ఇస్తుండగా బాణా సంచా పేలింది. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణా కోల్పోయారు. జోయ‌నా వేదిక‌మీద లైవ్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుండ‌గా… వేలాది మంది ఈ ప్ర‌ద‌ర్శ‌న తిల‌కిస్తున్నారు.

Spanish popstar Joana Sainz killed in freak fire accident

అంద‌రూ ఆమె ప్ర‌ద‌ర్శ‌న ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత‌లో రెండు రాకెట్లు ప్ర‌మాద‌వ‌శాత్తు వేదిక‌పైకి దూసుకువ‌చ్చాయి. ఒకటి ఏకంగా ఆమె కడుపులోకి దూసుకుపోయింది. ఆమె ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగానే ఇదంతా జ‌రుగుతుందా ? అని కొంద‌రికి సందేహాలు వ‌చ్చాయి. చివ‌ర‌కు అంద‌రూ తేరుకునేలోగానే వేదిక మీద ఒక్కసారిగా పేలుడు, సంభవించి మంటలంటుకోవడంతో ఆ మంటల్లో జోయానా చిక్కుకు పోయింది.

అపస్మారక స్థితిలోకి జారుకున్న ఆమెను ఆసుపత్రికి తరలించే సమయానికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేస నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బాణసంచాలో పేలుడు పదార్థాన్ని మోతాదుకు మించి కూర్చటం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లుగా తమ ప్రదర్శన సందర్భంగా ఇలా బాణసంచాను కాల్చినప్పటికీ ఎప్పుడూ ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోలేదట‌.

జోయానా బ్యాడ్‌ల‌క్ ఏంటంటే షో ముగిసేందుకు 15 నిమిషాల‌కు ముందే ఈ ప్రమాదం జ‌రిగింది. ఎంతో ఉత్సాహంగా మొద‌లైన ఈ షో చివ‌ర‌కు విషాదంతో ముగిసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version