ఈసారి బడ్జెట్ బ్రీఫ్ కేస్ మారింది..!

-

బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ముందు నిర్మలా సీతారామన్… రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి బడ్జెట్ పత్రాల కాపీని ఆయను అందించారు. అక్కడి నుంచి పార్లమెంట్ కు విచ్చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2019 ను ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. దేశ ప్రజలంతా ఎన్నో ఆశలతో బడ్జెట్ కోసం ఎదురు చూశారు. ఇక.. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా… తొలిసారిగా ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ముందు నిర్మలా సీతారామన్… రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి బడ్జెట్ పత్రాల కాపీని ఆయను అందించారు. అక్కడి నుంచి పార్లమెంట్ కు విచ్చేశారు. అయితే… ఈసారి బడ్జెట్ పత్రాలు ఉండే బ్రీఫ్ కేసు మారింది. సాధారణంగా గోధుమ రంగులో ఉండే సూట్ కేసులో బడ్జెట్ పత్రాలను పెట్టుకొని ఆర్థిక మంత్రులు పార్లమెంట్ కు వస్తారు.

కానీ.. ఈసారి నిర్మలా సీతారామన్… ఎర్రటి వస్త్రంతో ప్యాక్ చేసిన బ్యాగ్ ను పట్టుకొని పార్లమెంట్ కు విచ్చేశారు. దానిపై రాజముద్ర కూడా ఉండటం గమనార్హం. బ్రిటీష్ కాలం నాటి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి… భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఆర్థిక మంత్రి పెద్ద పీట వేశారు. అందుకే ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చారు. ఇక.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టిన రెండో మహిళ నిర్మలా సీతారామన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version