ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. సరి కొత్త బల్క్ డ్రగ్ పార్క్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ స్థాయిలో తన పట్టును నిలుపుకొంటోన్నారు. రాష్ట్రానికి అవసరమైన వరుస ప్రాజెక్టులను సాధించుకుంటోన్నారు. మొన్న విజయనగరం జిల్లాలోని భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి అనుమతులను పొందుకున్నారు. తరువాత మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికీ ముందడుగు వేశారు. త్వరలో ఈ పోర్ట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ పరిస్థితుల మధ్య ఇప్పుడు తాజాగా మరో భారీ ప్రాజెక్ట్‌ను రాష్ట్రానికి తెప్పించుకున్నారు వైఎస్ జగన్. బల్క్ డ్రగ్ పార్క్‌‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రిత్వ శాఖ ఈ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. 1,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ యొక్క విలువ. ఈ మేరకు ఫార్మాసూటికల్స్ విభాగం సంయుక్త కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు లేఖ రాశారు.

ప్రిన్సిపల్ అప్రూవల్ లేఖను అందినప్పటి తేదీ నుంచి 90 రోజుల్లోగా ఈ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను అందజేయాలని అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి మండలం కేపీ పురం-కోదాడ వద్ద బల్క్ డ్రగ్‌ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి స్కీమ్ స్టీిరింగ్ కమిటీ అంగీకరించినట్లు తెలిపారు. ఈ పార్క్‌లో సాధారణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి గ్రాంట్-ఇన్-ఎయిడ్ అందించడానికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ఈ లేఖలో వెల్లడించారు.

డీపీఆర్‌ను ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అయిన ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు సమర్పించాలని కోరారు. ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయదలిచిన ప్రదేశం, మొత్తం భూభాగం, అందులో నెలకొల్పడానికి అవసరమైన బల్క్ డ్రగ్ యూనిట్లకు కేటాయించడానికి అవసరమైన స్థలాల వివరాలను చేర్చాలని చెప్పారు. గ్రీన్ బెల్ట్, ల్యాండ్‌స్కేప్, కాస్ట్, ఇన్సూరెన్స్, ప్రాజెక్ట్ ఖర్చు, యూనిట్ల సంఖ్య, కేంద్రం నుంచి క్లియరెన్స్‌లు పొందడానికి ప్రతిపాదిత సమయం.. వంటివన్నీ ఇందులో పొందుపర్చాలని వ్యక్తపరచారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version