ఫోన్ పే లో బంపర్ ఆఫర్…!

-

గూగుల్ పే తర్వాత డిజిటల్ లావాదేవీల్లో ఓ రేంజ్ లో క్లిక్ అయిన యాప్స్ లో ఫోన్ పే ఒకటి. నగదు బదిలీ, రీచార్జ్, హోటల్ బుకింగ్, చెల్లింపులు ఇలా ఏది అయినా సరే ఫోన్ పె ద్వారా చేసుకోవచ్చు. గూగుల్ పే కంటే ఎక్కువగా ఇది ఫీచర్లను అందిస్తుంది. దానికి తోడు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఎక్కువగా ఉండటంతో దుకాణాల్లో, నగదు చెల్లింపుల్లో దీన్నే ఎక్కువగా వాడుతున్నారు జనం.

ఈ నేపధ్యంలో ఈ సంస్థ మరో ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంకు ఖాతాలో డబ్బున్నా సరే నగదు అవసరమైనప్పుడు దగ్గర్లో ఏటీఎం లేకపోతే మాత్రం పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి ఈ సంస్థ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఫోన్ పె నుంచి ఇప్పటి వరకు చెల్లింపులు మాత్రమే ఉండేవి. ఇక నుంచి నగదు ఉపసంహరణకు కూడా అవకాశం కల్పించనుంది.

నగదు విత్ డ్రాకి గానూ ‘ఫోన్‌పే ఏటీఎం’ను ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫోన్ పే వాడే వాళ్ళు దుకాణాల దగ్గర దీనిని వాడుకునే సదుపాయం కల్పించింది. అయితే దీని నుంచి కేవలం రూ.వెయ్యి మాత్రమే పొందే అవకాశ౦ ఉంటుంది. యాప్‌ ఓపెన్‌ చేసి స్టోర్స్‌లోకి వెళ్లి ఫోన్‌పే ఏటీఎం మీద గనుక క్లిక్‌ చేస్తే మన దగ్గరలో ఉన్న ఫోన్‌పే సదుపాయం దుకాణాలు దర్శనం ఇస్తాయి.

దేశ రాజధాని ఢిల్లీలో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది సంస్థ. దీని ద్వారా మన బ్యాంకు ఖాతాలోని దుకాణదారుడి దగ్గరకు వెళ్లి అతని వద్ద మనం నగదు తీసుకునే సదుపాయం ఉంటుంది. ఇందుకోసం చార్జీలు ఏమీ వసూలు చేయమని, వినియోగదారుల కోసం నాణ్యమైన సేవలు అందించడానికి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని, నగదు సదుపాయం కోసమే అందుబాటులోకి తెచ్చామని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news