తిరుమల లడ్డు వివాదం.. నటుడు మోహన్ బాబు సంచలన ట్వీట్..!

-

తిరుమల లడ్డు వివాదం పై పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు  స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును కలుపుతున్నారని తెలియగానే తాను తల్లడిల్లపోయానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు మోహన్ బాబు. కళియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వద్ద ఇలా జరగడం ఘోరం అన్నారు. ఈ కల్తీ ఘటన వాస్తవం అయితే.. నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

నిత్యం మా యూనివర్సిటీ నుంచి తిరుమల క్షేత్రాన్ని చూస్తాం. నాతో పాటు వేలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు నిత్యం భక్తి పూర్వకంగా తిరుమల వేంకటేశ్వరుడిని నమస్కరించుకుంటాం. ఆ స్వామి వారి దగ్గర ఇలా జరగడం గోరాతి ఘోరం.. అతినీచం, అరాచకం అన్నారు. ఒక భక్తుడిగా తాను దిగ్బ్రాంతిక గురయ్యానని ఆగ్రహం వ్యక్తం చేశారు మోహన్ బాబు. ఈ కళియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తన మిత్రుడు అందుకొని నూరేళ్లు చల్లగా ఉండాలని మోహన్ బాబు కోరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version