ఈనెల 26న జనసేనలోకి భారీ చేరికలు..!

-

సెప్టెంబర్  26వ తేదీన వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. ఈనెల 26న మంగళగిరి లో నిర్వహించే కార్యక్రమంలో వీరు పార్టీలో చేరుతారు.

వీరు ముగ్గురు ఇప్పటికే విడి విడిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో  సమావేశం అయి పార్టీలో చేరే అంశం పై చర్చించారు. మరోవైపు అదేరోజు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ యూత్ జోనల్ ఇన్ చార్జీగా ఉన్న అవనపు విక్రమ్, విజయనగరం, పార్వతిపురం జిల్లాల డీసీఎంఎస్ చైర్ పర్సన్ గా ఉన్న  డాక్టర్ అవనపు భావన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు.అదేవిధంగా విజయవాడ, గుంటూరు, తిరుపతి నగర పాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version