గ్రేటర్ లో పట్టుకోసం కాంగ్రెస్ ఎత్తులు.. ఆమెకు కీలక బాధ్యతలు..

-

గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది.. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ పీఠంపై ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది.. ఈ క్రమంలో ఎవరిని దగ్గరకు తీసుకోవాలి..? ఎవరికి పదవులు కట్టబెట్టాలనే ఆలోచనలు చేస్తోంది.. ఈ క్రమంలో చేరికలపై గట్టిగా ఫోకస్ చేస్తోంది.. ఇందులో భాగంగానే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను పార్టీలోకి తెచ్చుకున్నారు.. మరికొంమందిని లాగాలని చూస్తున్నారు..

పార్టీ పదవుల విషయంలో ఈసారి గ్రేటర్‌ హైదరాబాద్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది..పీసీసీ కమిటీలో బలమైనే నేతలకు అవకాశం ఇవ్వాలని చూస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి తర్వాత అత్యంత కీలకమైన పదవిగా ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని గ్రేటర్ లో పట్టుండే నేతలకు అప్పగిస్తే.. పార్టీ బలోపేతంతో పాటు.. జీహెచ్ఎంసీ లో కూడా పాగా వెయ్యొచ్చని నేతలు భావిస్తున్నారు.. ఈ నేపధ్యంలో పీజేఆర్ కూతురు విజయా రెడ్డికి మహిళా కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే, కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశం ఉందని కొందరు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. విజయారెడ్డి కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే, పీజేఆర్‌కు ఉన్న ఇమేజ్ కూడా కలిసి వస్తుందని హై కమాండ్ చెవులో వేశారట.. దీనిపై హైకమాండ్ కూడా ఆలోచిస్తోందని టాక్ వినిపిస్తోంది..

పీసీసీలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కొందరు నేతలు ఇప్పటికే అధిష్టానాన్ని కోరుతున్నారు.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ అదేవిధంగా పీసీసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో నేతలు లాబీయింగ్ చేస్తున్నారట. గ్రేటర్ పట్టుకున్న పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా.. ముఖ్యనేతలతో టచ్ లో ఉండటంతో
ఆమె వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.. ఆమెకు బాధ్యతలు కట్టబెట్టి.. కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసుకోవాలనే భావనలో పార్టీ నేతలు ఉన్నారట.. మొత్తంగా పీజేఆర్ ఇమేజ్ ను కాంగ్రెస్ వాడుకుంటుందో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version