బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్న బన్నీ.. కారణం..?

-

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా చలామణి అవుతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తన రేంజ్ ను పాన్ ఇండియా లెవెల్ కి మార్చుకున్నాడు. ఇకపోతే ఇంతటి మంచి స్టార్ డమ్ ఉన్న అల్లు అర్జున్ తన కెరీర్ లో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా వదులుకున్నాడు. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

1. బొమ్మరిల్లు:సిద్ధార్థ్ హీరోగా నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసిన చిత్రం బొమ్మరిల్లు. భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జెనీలియా కూడా అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇకపోతే సిద్ధార్థ కెరీర్ ను యూ టర్న్ తిప్పిన ఈ సినిమా లో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ అయింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ కథని ముందుగా అల్లు అర్జున్ కి చెప్పారట దర్శకుడు భాస్కర్ . కానీ హ్యాపీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంవల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశారు బన్నీ.

2 .100% లవ్:సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో సుమారుగా పది సంవత్సరాల క్రితమే ఈ సినిమా రావాల్సి ఉంది. ఇక సుకుమార్ ఏ కథ రాసుకున్నా సరే ముందుగా ఆ కథను అల్లు అర్జున్ కి వినిపించాడట. ఈ విధంగానే 100% లవ్ సినిమా కథ గొప్పగా వున్నా ఎందుకో ఈ సినిమాకు కనెక్ట్ కాలేకపోయారు. అంతే కాదు ఇలాంటి సాఫ్ట్ లవ్ స్టోరీస్ నా బాడీ లాంగ్వేజ్ కు సెట్ అవ్వదు అని రిజెక్ట్ చేశారట బన్నీ.

3. అర్జున్ రెడ్డి :
ఈ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు సందీప్. అంతే కాదు విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఓవర్నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా కథను ముందుగా అల్లు అర్జున్ కు వినిపించగా ఆయన ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి సాహసం చేయలేను అని చెప్పి రిజెక్ట్ చేశారట.

ఇవే కాకుండా గీత గోవిందం లాంటి సినిమాను కూడా వదులుకున్నారు బన్నీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version