pushpa : తగ్గేదేలే… పుష్ప నుంచి బన్నీ లుక్ రిలీజ్

-

టాలీవుడ్‌ హీరో, ఐకార్‌ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న పాన్‌ ఇండియా మూవీ పుష్ప. అల్లు అర్జున్‌ మరియు డైరెక్టర్‌ సుకుమార్‌ ల క్రేజీ కాంబినేషన్‌ లో మూడో సినిమా గా తెరకెక్కతోంది ఈ పుష్ప సినిమా. ఇక ఈ సినిమా బన్నీ సరసన టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ రష్మిక మందనా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతున్నది. ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన… పోస్టర్లు, టీజర్లు మరియు సాంగ్స్‌ దుమ్ము లేపుతున్నాయి. సాంగ్స్ అయితే… యూ ట్యూబ్‌ నే షేక్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యం లోనే దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి అల్లు అర్జున్‌ లుక్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలోని ఓ పాటకు సంబంధించిన షూటింగ్‌ పిక్‌ ను వదిలారు. ఈ పోస్టర్‌ లో బన్నీ… వెనుక భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. అలాగే.. AA నెంబర్‌ ప్లేట్‌ ఉన్న బైక్‌ పై కుర్చుకున్నాడు బన్నీ. ఇక ఈ పాటలో ఏకంగా 1000 మంది తో బన్నీ స్టెప్పులు వేయనున్నడట. ఇక దీవాలి పుష్ప నుంచి వచ్చిన.. ఈ బిగ్‌ అప్డేట్‌ తో… బన్నీ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news