వాహనదారులకు గుడ్ న్యూస్ : పెట్రోల్ పై రూ.3 తగ్గించిన ప్రభుత్వం

-

గత కొన్ని నెలలుగా పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో వాహనదారులు చుక్కలు చూశారు. ఈ నేపథ్యంలోనే.. దీపావళి పండగ రోజున వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాల దెబ్బకు.. పెట్రోల్‌ పై 5 రూపాయలు, డీజిల్‌ పై 10 రూపాయలు ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

వినియోగదారులకు మరింత ఉపశమనం కలిగించేలా.. వ్యాట్‌ను తగ్గించాలని రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన నేపథ్యం లోనే… పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలపై ఒడిశా సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ మరియు డీజిల్‌ పై రూ. 3 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గిస్తూ… కీలక ప్రకటన చేశారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. తగ్గిన ధరలు నవంబర్ 5 వ తేదీ అర్ధరాత్రి నుండి వర్తిస్తాయని స్పష్టం చేసింది ఒడిశా సర్కార్‌. ఈ మేరకు కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news