‘విక్రమ్’ సినిమాతో కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ ఫుల్ ఫేమస్ అయిపోయారు. కమల్ హాసన్ ను వెండితెరపైన అత్యద్భుతంగా ఆవిష్కరించారంటూ లోకేశ్ పైన సినీ ప్రముఖులతో పాటు సినీ లవర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోలు, నటీ నటులు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో పని చేయాలని అనుకుంటున్నారు.
లోకేశ్ కనకరాజ్ తన నెక్స్ట్ ఫిల్మ్ ఇళయ తలపతి విజయ్ తో ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, ఆ తర్వాత సినిమా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అలియాస్ ఐకాన్(పాన్ ఇండియా) స్టార్ ‘పుష్ప’ రాజ్..అల్లు అర్జున్ తో ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. బన్నీ ..ప్రస్తుతం ‘పుష్ప-2’ షూటింగ్ కు రెడీ అవుతున్నారు.
లోకేశ్ కనకరాజ్ తన పాత్రలతో క్రియేట్ చేసే సినిమాటిక్ యూనివర్స్ చాలా బాగుంటుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో సెలబ్రిటీలు సైతం డిస్కస్ చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు టాలీవుడ్ తో పాటు ‘పుష్ప’ సినిమాతో ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా హిందీ బెల్ట్ లో క్రేజ్ బాగా పెరిగింది.
‘పుష్ప’కు ముందు నుంచే మలయాళం, కన్నడ, తమిళ్ భాషల్లో అల్లు అర్జున్ ఫుల్ ఫేమస్ కాగా, లోకేశ్ కనకరాజ్ ..బన్నీతో ఫిల్మ్ చేస్తే డెఫినెట్ గా రికార్డులను తిరగరాస్తుందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. లోకేశ్ ఇప్పటికే బన్నీ కోసం స్టోరి రెడీ చేసుకున్నారని కూడా వార్తలొస్తున్నాయి. కానీ, ఇందులో నిజమెంతుందనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే.