రజనీకాంత్ లేకుండా ‘జైలర్’ పోస్టర్..డైరెక్టర్‌పై ఫ్యాన్స్ ఫైర్!

-

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ చిత్రం ‘జైలర్’ ఫిల్మ్ పోస్టర్ ను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. దాంతో రజనీ అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. కాగా, కొందరు మాత్రం డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.

ఫిల్మ్ పోస్టర్ పైన రక్తసిత్తమైన పొడవాటి కత్తి ఒకటే ఉంచి..కనీసంగా రజనీకాంత్ ఇమేజ్ పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో అభిమానుల కోసం సినిమా తీయాల్సిన బాధ్యత డైరెక్టర్ పైన ఉందని కొందరు అంటున్నారు.

‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ పిక్చర్ కు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘జైలర్’ ఫిల్మ్ నుంచి వచ్చే నెక్స్ట్ అప్ డేట్స్ ప్లస్ పోస్టర్స్ లో రజనీకాంత్ కనబడేలా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అభిమానులు నెల్సన్ ను కోరుతున్నారు.

రజనీకాంత్ సినీ ప్రేక్షకులకు చివరగా ‘అన్నాత్తె’(తెలుగులో ‘పెద్దన్న’) చిత్రంలో కనిపంచారు.ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. అన్నా చెల్లెల్ల సెంటిమెంట్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా స్టోరి..రొటీన్ ఫార్ములా అనే విమర్శలొచ్చాయి. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు డి.ఇమ్మాన్ మ్యూజిక్ అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version