ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పుల భారం భరించలేక ఓ తండ్రి తన కొడుక్కి విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలోని వన్ టౌన్‌లో శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
స్థానికుల కథనం ప్రకారం… బంగారు వ్యాపారి సాయి ప్రకాష్ రెడ్డి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే మార్గం కనబడక, ఇచ్చిన వారి వేధింపులు తాళలేక కుమారుడు దీక్షిత్ రెడ్డి (7)కి సైనైడ్ ఇచ్చి చంపేసి.. తాను కూడా సైనైడ్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
విజయవాడలో తండ్రి-కొడుకు విషాదాంతం
విజయవాడ వన్ టౌన్‌లో బంగారు వ్యాపారి సాయి ప్రకాష్ రెడ్డి, అప్పుల భారంతో కుమారుడు దీక్షిత్ రెడ్డి (7)కి సైనైడ్ ఇచ్చి చంపి తను కూడా సైనైడ్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు విచారణ… pic.twitter.com/8OfSgyPLj4
— ChotaNews App (@ChotaNewsApp) April 11, 2025