మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సామాజిక న్యాయంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మరాయి.మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటన సైతం విడుదల చేశారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన భారత సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు.
సబ్బండ కులాల అభ్యున్నతికి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన ఆశయాలను అమలు చేసిందని గుర్తుచేశారు.అదే స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా సామాజిక ప్రగతి, సామాజిక న్యాయం సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు.శక్తివంతమైన భారత సమాజ ఐక్యతను బలహీన పరుస్తున్న వర్ణ కుల వివక్ష నుంచి విముక్తి కోసం జీవితకాలం పోరాడిన మహాత్మ పూలే కేసీఆర్ వెల్లడించారు.