ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మార్నింగ్ వాక్ చేస్తూ గ్రామస్తులతో ముచ్చటించారు. శుక్రవారం ఉదయం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడులో హోంమంత్రి మార్నింగ్ వాక్ చేశారు.ఈ సందర్భంగా ఆమె వెంట గ్రామస్తులు సైతం వచ్చారు.
అనంతరం వేంపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి అనిత నివాళులు అర్పించారు.వాకింగ్ చేస్తూ ప్రజల యోగక్షేమాలు వంగలపూడి అనిత అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే మంగళహారతితో హోం మంత్రికి పలువురు మహిళలు స్వాగతం పలికారు. ఉదయం వాకింగ్ చేస్తూ గ్రామస్తుల సమస్యలను హోంమంత్రి అడిగి తెలుసుకోవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.