మేడారం జాతరకు వెళ్ళే వారికి బస్ ఛార్జీల వివరాలు…!

-

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతరకు సర్వం సిద్దమవుతుంది. దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే ఈ జాతరకు దాదాపు 900 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దేశం నలుమూలల నుంచి ప్రజలు ఈ ఉత్సవం కోసం తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు.

గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కడుతూ జరిగే ఈ తెలంగాణా కుంభమేళాకు వెళ్ళాలి అనుకునే భక్తుల కోసం తెలంగాణా ఆర్టీసీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా.. అక్కడికి వెళ్లాలనుకునేవారి కోసం బస్సు ఛార్జీల వివరాలను ఆర్టీసి ప్రకటించింది. మొత్తం 23 లక్షల మందిని తరలించేలా ఇప్పుడున్న ఛార్జీలకు 50% అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

మేడారం జాతరకు జోరుగా ఏర్పాట్లు4000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలవుతున్న ఈ జాతరలో ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దె మీదకు చేరుకోగా, ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 8న దేవతల వన ప్రవేశం ఉంటుంది.

ఛార్జీల వివరాలు;
హైదరాబాద్ నుంచి రూ.440
ఖాజీపేట్ నుంచి రూ.190
హన్మకొండ నుంచి రూ.190
వరంగల్ నుంచి రూ.190
పరకాల నుంచి రూ.190చిట్యాల నుంచి రూ.200
ఘణపురం(ము) నుంచి రూ.140
భూపాలపల్లి నుంచి రూ.180
కాటారం నుంచి రూ.210
కాళేశ్వరం నుంచి రూ.260
సిరోంచ నుంచి రూ.300
ఏటూర్ నాగారం నుంచి రూ.60
కొత్తగూడ నుంచి రూ.240
నర్సంపేట్ నుంచి రూ.190
మహబూబాబాద్ నుంచి రూ.270
తొర్రూర్ నుంచి రూ.280
వర్ధన్నపేట్ నుంచి రూ.230
స్టేషన్ ఘన్‌పూర్ నుంచి రూ.240
జనగామ నుంచి రూ.280 వసూలు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news