ప‌సిడి ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

ప‌సిడి ప్రియుల‌కు గుడ్ న్యూస్‌. నిన్ని భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఈ రోజు భారీగా క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర భారీగా పతనమైంది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు ఏకంగా రూ.1,070 పతనమైంది. దీంతో పసిడి ధర రూ.41,790కు క్షీణించింది. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.970 క్షీణించింది. దీంతో పసిడి ధర రూ.38,300కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.1500 కుప్పకూలింది. దీంతో ధర రూ.49,500కు దిగొచ్చింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1000 క్షీణించింది. దీంతో ధర రూ.39,100కు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.980 క్షీణించింది. దీంతో ధర రూ.40,300కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.1500 దిగొచ్చింది. దీంతో ధర రూ.49,500కు క్షీణించింది.

Read more RELATED
Recommended to you

Latest news