కర్నూలు జిల్లాలో బస్సు బోల్తా..8 మంది !

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనలు అమలు చేసినా… రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం మరియు నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయి. నిజంగా ఈ మధ్య మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా లో మినీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు మంత్రాలయం సమీపంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్దకు రాగానే… డ్రైవర్ నిద్రమత్తు తో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భద్రాచలం నుంచి మంత్రాలయం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ బస్సు లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది… ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పొలం లో పడి ఉన్న బస్సును స్థానికులు జెసిబి సాయంతో తొలగించారు.