Ganesh Chaturthi: చవితి చంద్రుడిని చూస్తే పరిహారం ఇలా చేసుకోండి !!

-

భాద్రపద శుద్ధ చవితి. వినాయకచవితి. ఈ రోజు సాయంత్రం చంద్రదర్శనం చేయకూడదు అని శాస్త్రవచనం. అయితే ఎవరైనా పొరపాటున చంద్రడుని దర్శిస్తే ఎలా అనేది సందేహం. ఏటా చాలామందికి ఇది అనుకోకుండా జరుగుతుంది. అయితే దీనికి ఒకటే పరిహారం… చవితినాడు వినాయకపూజ పూర్తయిన తర్వాత శమంతకోపాఖ్యానం కథ విని స్వామి వారి అక్షింతలు తలమీద వేసుకుంటే లేదా పండితులు/పురోహితుల ద్వారా వేయించుకుంటే నీలాపనిందలు రావు.

ganesh chaturthi moon

దీనికి కారణం ఆరోజు శమంతకమణిని అపహరించాడని శ్రీకృష్ణపరమాత్ముడిపై నీలాపనిందలు రాగా ఆయన నేను అపహరించలేదని నిరూపించుకుంటాడు. ఆ సమయంలో ప్రజలు, భక్తులు, రుషులు స్వామి మీరు సమర్థులు గనుక నీలాపనిందను తొలగించుకోగలిగారు. మాలాంటి వారి పరిస్థితి ఏమిటి అనగా ‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి. ఒకవేళ ఈ కథను వినకున్నా కనీసం తర్వాతి రోజైనా స్వామి వారికి పూజచేసి కథ విని అక్షింతలు వేసుకోవాలి.

ganesh and moon story

అయితే దీనిలో గమనించాల్సిన కావాలని చంద్రదర్శనం చేస్తే తప్పక నీలాపనిందులు వస్తాయి. స్వామి అక్షింతలు వేసుకున్నా స్వామి క్షమించడు.ఎందుకంటే ఆయన మాటను వినకుంటే ఆయన కూడా ఏం చేయడు. అయితే పశ్చాతాపపడి, స్వామిని వేడుకుంటే కొంత ఫలితం ఉండవచ్చు.

– శ్రీ

వినాయక చవితి : చంద్రుడిని చూడ‌కూడ‌ద‌ట‌.. దైవ కోణం, శాస్త్రీయ దృక్పథం

Read more RELATED
Recommended to you

Latest news