బిజినెస్ ఐడియా: మసాలా మేకింగ్ యూనిట్ తో అదిరే లాభాలని పొందండి..!

-

మీరు ఏదైనా వ్యాపారంని మొదలుపెట్టాలని అనుకుంటున్నారా..? ఆ వ్యాపారంతో మంచిగా లాభాలను సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు అనుసరించారు అంటే తప్పకుండా మంచిగా రాబడి వస్తుంది. పైగా ఎలాంటి రిస్క్ ఉండదు.

money

అలానే ఈ బిజినెస్ చాలా సులభం కూడా. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది మరియు తక్కువ పెట్టుబడి తో మీరు ఈ వ్యాపారాన్ని చేయొచ్చు. అదే మసాలా మేకింగ్ యూనిట్. మరి ఇక ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు లోకి వెళ్లితే… మసాలా మేకింగ్ యూనిట్ ద్వారా మంచిగా రాబడి వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సుగంధద్రవ్యాలను తప్పక వాడుతూ ఉంటారు. కనుక ఎప్పుడూ మీకు మంచి డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు.

దీనిని మీరు ఇంట్లోనే ప్రారంభించొచ్చు. మంచిగా మీరు సప్లై చేసి మీ యొక్క వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చు. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నివేదికలో సుగంధ ద్రవ్యాల తయారీలోనూ యూనిట్ ఏర్పాటుకు పూర్తి బ్లూ ప్రింట్ తయారు చేసి వుంది. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మీకు మూడున్నర లక్షలు ఖర్చు అవుతాయి.

300 చదరపు అడుగుల బిల్డింగ్ ఏర్పాటుకు 60 వేల రూపాయలు ఖర్చవుతాయి. ఇలా మీరు మీ యొక్క బిజినెస్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా ప్రధానమంత్రి ఉపాధి పథకం కింద లోన్ కూడా వస్తుంది. ముద్ర లోన్ కూడా సహాయపడుతుంది. ఎలా లేదన్నా సరే మీకు మూడు లక్షల వరకు లాభం వస్తుంది. మీరు ఇంట్లో వ్యాపారాన్ని మొదలు పెట్టుకుంటే ఖర్చు తగ్గుతుంది. దగ్గర్లో ఉన్న షాప్స్ కి మీయొక్క మసాలా దినుసులు సప్లై చేసి వ్యాపారం చెయ్యచ్చు. ఇలా చక్కగా ఈ బిజినెస్ తో సంపాదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version