బిజినెస్ ఐడియా: తేనెటీగల పెంపకంతో ఆదాయం లక్షల్లో.. పైగా ప్రభుత్వం నుండి 85 శాతం సబ్సిడీ కూడా..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. వ్యాపారాల ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నారు. మీరు కూడా మంచి వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అదే తేనెటీగల పెంపకం.

 

ఈ వ్యాపారం ద్వారా చాలా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. మరిక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు లోకి వెళ్ళిపోదాం. గ్రామంలో కానీ నగరంలో కానీ ఈ వ్యాపారం చేయడానికి అనుకూలంగానే ఉంటుంది పైగా కేంద్ర ప్రభుత్వం సైతం ఆర్థిక సహాయం అందిస్తుంది. తేనె ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు.

వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పంట ఉత్పాదకతను మెరుగు పరచడానికి తేనెటీగల పెంపకం అభివృద్ధి పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చింది. నేషనల్ బీ బోర్డు నాబార్డ్ తో కలిసి ఇండియాలో తేనెటీగల పెంపకానికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ స్కీమ్స్ ని కూడా ప్రారంభించింది. అయితే ఈ స్కీమ్స్ ద్వారా 80 నుంచి 85 శాతం వరకు సబ్సిడీ అందిస్తారు.

ఈ వ్యాపారం కోసం మీరు ఎక్కువ శ్రమపడలేకపోతే పది పెట్టెలతో కూడా మొదలు పెట్టొచ్చు. ఒక పెట్టెలో 40 కిలోల తేనే వస్తుంది. 10 పెట్టెలకి 400 కిలోలు అవుతుంది. ఒక కిలో తేనె 350 రూపాయల చొప్పున అమ్మితే లక్షల 40 వేల రూపాయలు మీరు పొందొచ్చు. ఒక్కో పెట్టి కోసం 3500 ఖర్చు అవుతుంది. ఎలా చూసుకున్న లాభాలు లక్షల్లోనే ఉంటాయి. ఇలా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టి మంచిగా లక్షల్లో ఆదాయం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news