అక్రమసంబందానికి అడ్డుగా ఉన్నాడని సొంత మామను హత్య చేయించిన వివాహిత..

-

సమాజంలో నానాటికీ విలువలు పతనం అవుతున్నాయి.కొందరు వివాహ వ్యవస్థ కంటే వివాహేతర సంబంధానికే మొగ్గు చూపుతున్నారు.చివరికి కుటుంబాన్ని చేజెతులా రోడ్డుకు ఈడ్చుకుంటున్నారు.ఇంకొందరు ఏకంగా హత్యలు చేయడానికి, చేయించడానికి వెనుకాడడం లేదు.తాజాగా ఓ మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న నెపంతో సొంత మామను కిరాతకంగా హత్య చేయించింది.ఈ దారుణ ఘటన కు సంబంధించిన వివరాలు..కర్ణాటకలోని రామానగర తాలూకా భైరవనదొడ్డి గ్రామ సమీపంలోని తోటలోని ఇంట్లో కాంగ్రెస్ నాయకుడు గంటప్ప (55) ఫిబ్రవరి 25న హత్యకు గురయ్యాడు.

పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి.సొంత కోడలే ఈ ఘాతుకానికి పాల్పడింది అని తెలుసుకున్నారు.గంటప్ప కుమారుడు సందీప్ తో చైత్ర కు కొన్నేళ్ళ క్రితం వివాహమైంది.పెళ్లికి ముందు ఆమె నవీన్ అనే వ్యక్తిని ప్రేమించింది.పెళ్లి తర్వాత కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇటీవల కాలంలో తనకు ఆస్తిలో వాటా ఇవ్వలేదని మామ గంటప్ప పై కక్ష పెంచుకుంది.ఇక వివాహేతర సంబంధం కూడా అతడు ఉండగా కొనసాగించడం కష్టమని భావించింది.ప్రియుడు నవీన్ తో మామను హత్య చేయించింది.బిడది పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news