చదువుతో సంబంధం లేకుండా బిజినెస్ లు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది..గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు… వ్యవసాయాన్ని చేసుకుంటూ ఈ వ్యాపారం చేస్తే మీకు రెట్టింపు ఆదాయం రావడం పక్కా..ఎందుకంటే ఈ మధ్య కాలంలో సంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులతోపాటు, ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరిగిది. కాబట్టి మీరు వ్యవసాయం చేస్తు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అలాంటి వ్యాపారంలో చేపల పెంపకం కూడా ఒకటి. చేపల పెంపకంలో ఏడాదికి 25వేల పెట్టుబడి పెట్టినట్లయితే మీకు నెలకు లక్షల రూపాయలకు పైగా ఆదాయం ఉంటుంది..
తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. చేపల పెంపకానికి సంబంధించి రుణాలు కూడా అందిస్తుంది. కేంద్రంలోని మోదీ సర్కార్ ముద్ర రుణం ద్వారా ఇలాంటి వ్యాపారం ప్రారంభించేవారికి చేయూతనిస్తుంది. మంగుర్ చేపల పెంపకం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో చైనా, జపాన్ తర్వాత భారత్ మూడవ స్థానంలో ఉంది. చేపల పెంపకం (మచ్చలి పాలన్) రైతులకు చాలా లాభదాయకమైన వ్యాపారంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ చేపల పెంపకం ద్వారా మంచి లాభాలు పొందవచ్చన్నది రైతుల ప్రశ్నగా మిగిలిపోయింది..
చేపల కోసం చెరువు నిర్మాణం..
ఎకరం చెరువు సరిపోతుంది. చెరువు కోసం 7 నుండి 8 pH విలువ కలిగిన మట్టిని ఎంచుకోండి.చెరువులో మాత్రమే మంచినీటి ఏర్పాట్లు చేయండి…మంగుర్ చేప 5 నుండి 6 నెలల్లో 100 నుండి 120 గ్రాములు అవుతుంది. ఒక హెక్టారు చెరువులో 3 నుండి 4 టన్నుల చేపలు ఉత్పత్తి అవుతాయి. దీని ధర మార్కెట్‌లో కిలో 200 నుంచి 300 వరకు లభిస్తోంది. మంగూర్ చేపల పెంపకానికి హెక్టారుకు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనితో మీరు సులభంగా 3-5 లక్షల రూపాయలు సంపాదించవచ్చు.. వివరంగా చెప్పాలంటే మంగూర్ చేపలను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో మంచి లాభాలను ఇస్తుంది. చిన్న, సన్నకారు రైతులు కూడా చిన్న చెరువులో చేపల పెంపకం చేయడం ద్వారా సులభంగా మంచి లాభాలు ఆర్జించవచ్చు.. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది..