రాహుల్ ప్రధాని అవుతారనే ఈ కుట్ర – భట్టి

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పై అనర్హత వేటు వేయడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా చేపట్టిన భట్టి విక్రమార్క పాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. ఆయన పాదయాత్ర కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు వ్యతిరేకంగా రేపు నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు.

రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనే భయంతోనే మోదీ ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు తెరతీస్తుందని ఆరోపించారు. వేధింపులకు గురైన వారే గొప్పవారు అవుతారని పేర్కొన్నారు బట్టి విక్రమార్క. బిజెపి కుట్రను కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరికీ తెలిసేలా పలు కార్యక్రమాలు చేపడతామని అన్నారు. మతతత్వ ఫాసిస్టు బిజెపి ప్రభుత్వం చేస్తున్న ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ వెన్నంటి కోట్లాదిమంది ఉన్నారని మోడీ సర్కారు గ్రహించాలని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version