కూరగాయల నారుతో వ్యాపారం.. రూ. 90వేలు పెట్టుబడి పెడితే చాలు నెలకు రూ. లక్ష ఆదాయం

-

వ్యవసాయంతో నష్టాలే తప్ప పెద్దగా లాభాలు రాని రోజులివి..సంప్రదాయ పద్దతుల్లో సంప్రదాయ పంటలు వేస్తే ఇదే జరుగుతుంది. అదే వ్యవసాయానికి కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇస్తే.. ఇదే మంచి వ్యాపారంగా మలుచుకోవచ్చు. లాభాల పంట పండించాలంటే..ఈ రియల్‌ స్టోరీ వైపు ఓ కన్నేయండి. కరీంనగర్‌లో కూరగాయల నారు పెంపకంలో పలువురు రాణిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎక్కువ మంది నర్సరీల ( ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నారు.

ఎకరం విస్తీర్ణంలో షేడ్నెట్లు ఏర్పాటు చేసుకొని వివిధ రకాల కూరగాయల నారును పెంచుతున్నారు. కురగాయలు సాగు చేయాలంటే రైతులు ముందుగా నారును సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది… ఇందుకోసం గతంలో రైతులు తమ పొలాల వద్ద నారుమడులు ఏర్పాటు చేసుకునే వారు. వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తితే సరిగ్గా ఎదగక పాడైపోయేవి. ప్రస్తుతం ఈ నర్సరీలు వచ్చాక రైతులకు చాలా మేలు జరుగుతోంది. నారుకోసం రైతులు ఇతర జిల్లాలకు వెళ్లేవారు. స్థానికంగా వీటిని ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో రైతులు వచ్చి నారును కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యాపారంతో అటు రైతులకు, నిర్వాహకులుకు మేలు జరుగుతోంది.

ఆదాయం ఎంత వస్తుంది..

ఒక ఎకరా విస్తీర్ణంలో నర్సరీ ఏర్పాటు చేస్తే రూ 90 వేల వరకు ఖర్చు అవుతుండగా సీజన్లో నెలకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు ఆదాయం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కువగా టమాటా, వంకాయ, క్యాబేజీ, మిరప నారును పెంచుతున్నారు. టమాటా, క్యాబేజీ , క్యాలీ ఫ్లవర్ విత్తనాలు మొలకెత్తడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుండగా , పొలాల్లో నాటేందుకు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంట.

మిరప వంకాయ 25 రోజుల నుంచి 30 రోజుల సమయానికి పూర్తిస్థాయి అందుబాటులోకి వస్తాయి. కల్తీ విత్తనాల ద్వారా నారు, నాణ్యతలేని నారు పెంపకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నర్సరీ యాక్టును తెచ్చింది. నిర్వాహకులు ఇందులో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా రైతులకు మంచి కూరగాయల నారును ఇవ్వవచ్చని అధికారులు అంటున్నారు.

యువ రైతు జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సరీలో అన్ని రకాల కూరగాయల నారును పెంచుతున్నాం. రైతుల అవసరాల మేరకు పూర్తి స్థాయిలో నారును అందుబాటులో ఉంచి, తక్కువ ధరకే అందిస్తున్నాం. నర్సరీ ద్వారా నేను ఉపాధి పొందడమే కాకుండా, పది మందికి ఉపాధి కల్పిస్తున్నాను. రైతుల కోరిక మేరకు పూల నారును సైతం అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు.కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్లోనే 21 నర్సరీలున్నాయి. మీకు కూడా ఆసక్తి ఉంటే.. మీ ఏరియాలో ఈ వ్యాపారం బాగుంటుందనపిస్తే మొదలుపెట్టవచ్చు.. స్థలం మనదైతే పెట్టుబడి కూడా పెద్దగా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version