ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు వీలైనంత త్వరగా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పరిశ్రమలకు అనుమతి ఇచ్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి.. అనుమతులలో జాప్యం లేకుండా చూడాలన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టు పనులు పూర్తయ్యేలా ప్రయత్నించాలని అధికారులకు సూచించారు.
అన్ని రకాలుగా ఆయా సంస్థలకు చేయూతనివ్వాలని అన్నారు. జువ్వన్నెల దీన్నే, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. రెండవ దశలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.